సంగారెడ్డి, జూలై 2
టీజేఎంయూ సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్షుడిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ ను నియమించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో జరిగిన ఈపై యూనియన్ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ మాజూర్ యూనియన్ (టీజేఎంయూ) సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్షుడిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ ను నియమించారు. యూనియన్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నియామకం చేపట్టినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, యూనియన్ కార్యకలాపాలు, కార్మికుల సంక్షేమం, ఎన్నికలు తదితర అంశాల్లో తోపాజి అనంత కిషన్ తో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని యూనియన్ నాయకులకు సూచించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి యూనియన్ మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీజేఎంయూ రాష్ట్ర కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి, డివిజన్ కార్యదర్శి అంజాగౌడ్, సంగారెడ్డి డిపో అధ్యక్షుడు మహేందర్, కార్యదర్శి విక్రమ్, జాయింట్ సెక్రటరీ ఎం.రవి, సురేష్, హిమగిరి, వెంకటేశం, రవి, వహీద్, మల్లికార్జున, మధుకర్, విజయ, సక్కుబాయ్ తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.












