సంగారెడ్డి/శంకర్పల్లి, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్):శంకర్పల్లి పరిధిలోని సింగాపురం 10వ వార్డులో రుద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా రుద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో మండపాన్ని అలంకరించి, వినాయకుడికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వినాయక చవితి సందర్భంగా రుద్ర యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సింగాపురం 10వ వార్డులో వినాయకుడికి పూజలు
Published On: August 29, 2025 10:55 pm