సంగారెడ్డి, సెప్టెంబరు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. 7వ రోజు మహిళలతో కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని సాయిమాణిక్ నగర్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద 7వ రోజు సందర్బంగా మహిళలతో కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిమాణిక్ నగర్ కాలనీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పోలీస్ శంకర్, కాలనీ పెద్దలు శ్రీనివాస్ సెట్, బసప్ప, మాధవరెడ్డి, సత్యనారాయణ, శంకర్ పోస్టల్, వినోద్ లడ్డు, వెంకటేశం, నారాయణ సింగ్, వెంకట్ రెడ్డి, నర్సింలు, ఎంఈఓ శంకర్, ఆర్మీ కిష్టయ్యతో మహిళలు, యువకులు పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు
Published On: September 3, 2025 10:02 am