మెదక్/గజ్వేల్, ఫిబ్రవరి 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది నైపుణ్యం మెరుగు పరిచేందుకు, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ అన్ని డిపోలలో ‘పవర్’ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపో డీఎం పావన్, సీఐ బాబు నాయక్ లు అన్నారు. గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపోలో శిక్షణలో భాగంగా ఉద్యోగులకు ఆటలు, పాటలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బెస్ట్ టీమ్ లీడర్ గా లక్ష్మి, బెస్ట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ గా స్వామి, బెస్ట్ బాల్ త్రోలో వల్లాల శ్రీనివాస్ లు ఎంపికయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. అనంతరం డీఎం పావన్, సీఐ బాబు నాయక్ లు మాట్లాడుతూ.. ‘మహాలక్షి ‘ పథకం అమలు అయిన నాటి నుంచి సంస్థ అభివృద్ధి పథంలో కొనసాగుతుందని, ఉద్యోగులకు పనిభారం, ఒత్తిడి పెరుగుతున్నా.. సిబ్బంది ఎంతో ఓర్పు, సహనంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను ప్రతి ఒక్క సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ఎదుర్కొనే పద్ధతులు విధులు ఆరోగ్యంపై ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్ల గురించి సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.