అంగన్ వాడీల్లో మూడో తరగతి వరకు విద్యా అశాస్త్రీయం: టీటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): అంగన్ వాడీలను ప్లే స్కూల్స్ గా మార్చిన బాగుంటుందని, కాని వాటిలో మూడవ తరగతి వరకు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదన సరైంది కాదని, వెంటనే విరమించుకోవాలని టీటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్, ప్రదాన కార్యదర్శి యం.మోహన్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అంగన్ వాడీలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా తల్లిదండ్రులు గుర్తించటం లేదని కనుక 1,2,3 తరగతులను అంగన్ వాడీలకు అప్పగించడం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మూసి వేతకే దోహదపడుతుందని, దీని ద్వారా సెకండరి గ్రేడ్ టీచర్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యవస్థకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేయాలంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని టీటీయూ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ గా మార్చాలనే ప్రతిపాదన ఆహ్వానించతగినదని వారు తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తరగతికొక టీచరు, సబ్జక్టుకొక టీచరు, ప్రధానోపాధ్యాయులు, తగినంత బోధనేతర సిబ్బంది పాఠశాలలో ఉండేలా చూడాలని టీటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్, ప్రదాన కార్యదర్శి యం.మోహన్ లు సూచించారు. పాఠశాలలలో పారిశుధ్య కార్మికుల నియమించాలని కోరారు. ప్రతి ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల నియమించాలని , క్రాఫ్ట్, డ్రాయింగ్, కంప్యూటర్ టీచర్ లను నియామకం చేపట్టాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో భౌతిక వసతులను కల్పించి,పూర్తి స్థాయిలో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి సెమి రెసిడెన్షియల్ పద్ధతిలో పాఠశాలను నడిపించుట వలననే గుణాత్మకమైన విద్య సాధ్యం అవుతుందని వారు తెలిపారు.

Join WhatsApp

Join Now