శివ్వంపేట సెప్టెంబరు 4 ( ప్రశ్న ఆయుధం న్యూస్): గర్భిణీలు పోషక ఆహారం సక్రమంగా తీసుకోకపోవడంతో రక్తహీనతతో పాటు పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఉండాలని, ఉద్దేశంతో మాతృదేవోభవ కార్యక్రమం ద్వారా గర్భిణీలకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రోటీన్ కిట్లను అందజేస్తున్నట్లు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన శివ్వంపేటతో పాటు చంది, రత్నాపూర్ గ్రామాల్లో గర్భిణులకు ప్రోటీన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణీలు మంచి పౌష్టిక ఆహారం అందేందుకు కూరగాయలతో పాటు గుడ్లు, పాలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న స్థానిక నాయకుల ద్వారా తమకు సమాచారం అందిస్తే నీలోఫర్ హాస్పిటల్ లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, లక్ష్మీకాంతం, వెంకటరామిరెడ్డి, మాధవరెడ్డి, కర్ణాకర్ రెడ్డి, కమలా పూల్ సింగ్, వేణుగోపాల్ రెడ్డి, గడ్డమీది కృష్ణ గౌడ్, సుధీర్ రెడ్డి, వరాల గణేష్, తరుణ్, బిస్కుంద అంజయ్య, ఇసారపు శ్రీనివాస్ గౌడ్, బిజినపురం సత్తయ్య, ఇసుగారి అరుణ్, కమలయ్యగారి వెంకటేష్, ప్రభు లింగంగౌడ్ తదితరులు ఉన్నారు.
గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి: నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి
Published On: September 4, 2025 7:14 pm