నూతన మున్సిపల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన: కూరగాయల మార్కెట్ అధ్యక్షులు
ఆర్మూర్,డిసెంబర్,
19(ప్రశ్న ఆయుధం) ఆర్ సి
ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రావణి ని శుక్రవారం ఆర్మూర్ కూరగాయల మార్కెట్ అధ్యక్షులు గంగాని స్వామి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు మార్కెట్ సమస్యలు కమిషనర్ కు వివరించారు. సమస్యలను తమరు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించే దిశలో పనులు జరుగుతాయని అన్నారు. అదేవిధంగా పట్టణ ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపల్ కు సహకరించాలని ప్రజలను కమిషనర్ కోరారు. కమిషనర్ మాట్లాడుతూ.. గ్రూప్స్ లో ఉద్యోగం సాధించి నేరుగా ఆర్మూరు పట్టణానికి మొదటి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి తెలిపారు కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు సక్రమంగా కొనసాగుతాయని, మున్సిపాల్ సిబ్బంది సహకరించాలని ప్రజలను కోరారు.