సంగారెడ్డి/పటాన్చెరు, జూలై 23 (ప్రశ్న ఆయుధం న్యూస్):పటాన్చెరు పట్టణంలో ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండి, తొట్టెల ఊరేగింపుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ ముదిరాజ్ పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. పల్లకీలు, పూర్ణకుంభాలతో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ముదిరాజ్ సామాజిక స్థిరత్వానికి అర్చనలు, సంస్కృతీ ఉత్సవాలు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముదిరాజ్ సంఘం నేతలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పటాన్చెరు ఫలహారం బండి, తొట్టెల ఊరేగింపుల్లో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్
Published On: July 23, 2025 6:49 pm