సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రావణ మాసం పురస్కరించుకుని పటాన్‌చెరులో నిర్వహించిన భోల్ భం కావడి యాత్ర కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాదిరి ప్రిథ్వీరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ యాత్ర భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది. ఇంద్రేశం గ్రామంలోని శివాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆలయ ఘంటాధ్వనులు, భజనలు, డప్పులు, శంఖనాదాలతో సాగింది. భక్తులు “భం భం భోలే… హర హర మహాదేవ! శంభో శంకర!” అంటూ శివుని నామస్మరణలో ముందుకు సాగారు. పవిత్ర గంగ జలాన్ని మోస్తూ, కావడిని భుజాన వేసుకుని అల్విన్ కాలనీ శివాలయం వరకు పాదయాత్రగా చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నాయకులు మాదిరి ప్రిథ్వీరాజ్ హాజరై శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ.. పటాన్‌చెరు అనేది మినీ ఇండియా లాంటిదని, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఐక్యతతో నివసిస్తున్నారని అన్నారు. శ్రావణ మాసం కాలంలో ఒడిశా వాసులు భక్తితో నిర్వహించిన ఈ బోల్ భం కావడి యాత్ర ఎంతో పవిత్రతను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శివాలయంలో పూజలు చేసిన మాదిరి ప్రిథ్వీరాజ్
Published On: August 4, 2025 7:31 pm