సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఎండీఆర్ ఫౌండేషన్ కో-పౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ అన్నారు. శనివారం హనుమాన్ మందిరంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్న గౌతమ్‌నగర్ మరాఠా సేనతో పాటు ఇతర మహిళలకు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో భక్తి, సేవా భావాలను పెంపొందించడం, తరువాతి తరాలకు మంచి విలువలను అందించడం మనందరి బాధ్యత అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రిథ్వీరాజ్ తెలిపారు.
సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించాలి: ఎండీఆర్ ఫౌండేషన్ కో-పౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్
Published On: August 23, 2025 9:30 pm