సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని, వీరశైవ లింగాయత్ మహా పాదయాత్ర కమిటీ పటాన్‌చెరు ఆధ్వర్యంలో 18వ మహా పాదయాత్ర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్ర పటాన్‌చెరు జేపీ కాలనీలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయం నుండి బొంతపల్లిలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ పాల్గొని శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాలుగా ఈ మహా పాదయాత్రను నిర్విరామంగా నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న కమిటీకి అభినందనలు తెలిపారు. ఇది వీరశైవ లింగాయత్ సోదరుల ఐక్యత, భక్తి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక అని అన్నారు. భవిష్యత్తులో ఈ యాత్ర మరింత విస్తృత స్థాయిలో జరగేందుకు మా తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
మహా పాదయాత్రలో బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్
Updated On: August 3, 2025 3:28 pm