సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబరు1 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వినాయక మండపాలలో వినాయకుని ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ పూజలు చేశారు. అనంతరం మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలలో భక్తులతో కలిసి భోజనాన్ని మాదిరి పృథ్వీరాజ్ వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదానం అన్నది అతి పెద్ద దానం అనే మన సంస్కృతిని ప్రతిబింబించే ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొని సేవకులు, నిర్వాహకులను అభినందించారు. భక్తులందరితో ఆప్యాయంగా కలిసి వినాయక నవరాత్రి ఉత్సవాలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువలను మరింత బలపరుస్తాయని అన్నారు.
వినాయక మండపాల వద్ద అన్నదానంలో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్
Updated On: September 1, 2025 7:37 pm