సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం గుమ్మడిదలలోని సిజిఆర్ ట్రస్ట్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాంతం పోరాడిన మహానేత ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయమైనవని, ఆయన చూపిన మార్గమే ఈ రోజు మనకు తెలంగాణను ఇచ్చిందని అన్నారు. ఆయన ఆలోచనలే తెలంగాణ ఉద్యమానికి బీజం వేశాయని, ప్రతీ తరం ఆయన త్యాగాలను గుర్తుంచుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మంద భాస్కర్ రెడ్డి, మొగులయ్య, సదానంద రెడ్డి, ఆకుల సత్యనారాయణ, భాస్కర్, మహిపాల్ రెడ్డి, వాసు దేవ రెడ్డి, సూర్యనారాయణ, జయపాల్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
Published On: August 6, 2025 11:22 am