దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజ నిర్వహించిన పులిమామిడి రాజు

సంగారెడ్డి/సదాశివపేట, అక్టోబర్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు తన అనుచరగళంతో కలిసి పురోహితులు జంగం మహేష్ స్వామి ఆధ్వర్యంలో లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ.. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. మన రాష్ట్ర దీపావళి అనగా చెడుపై మంచిని సాధించినందుకు గాను, శ్రీకృష్ణుడు నరకాసురున్ని వదించి ప్రజలను కష్టాల నుండి ముక్తి కలిగించి ఆనందాన్ని కలిగించిన వేళ ఈ దీపావళి పండుగను జరుపుకుంటామని, మనుషుల స్వభావాలు దీపాలాంటివే అని, కొందరు వెలగని దీపాలు తమో గుణానికి ప్రతీకలు, అంతరంగం నిండా అజ్ఞానమే. కొందరు గుడ్డి దీపాలు, రజోగుణ స్వరూపాలు అని ప్రజలకు తెలియపరిచారు. ఈ దీపావళి పండుగ ప్రజలకు సుఖసంతోషాలను, అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను కలుగజేయాలని ఆ లక్ష్మీ దేవతను ప్రార్థించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తాలెల్మ రాము, రాగం అనిల్, శ్రీశైలం, బండి రాజు, మనోజ్, పరమేష్, అఖిల్, సోమశంకర్, పీఎంఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment