సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): పేద ప్రజల గృహ కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలో లక్షలాది మందికి ఇండ్లను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతోష, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు విజయ్ కుమార్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు చాకలి చంద్రయ్య, హనుమంత్ రెడ్డి, వీరేష్, రాములు తదితరులు పాల్గొన్నారు
ఇందిరమ్మ పథకం ద్వారా పేదలకు మేలు: ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి
Published On: June 13, 2025 7:50 pm
