సంగారెడ్డి, జూన్ 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద 12 వార్డు మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున యువకులు పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడని పొన్న రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని పొన్న రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిష్టారెడ్డి, శైలేష్ రెడ్డి, సందీప్, వంశీ, అశోక్, సాయి, పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.
పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
Published On: June 19, 2025 6:58 pm
