మెదక్/రామాయంపేట, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): రామాయంపేట సర్కిల్ ఇన్స్ పెక్టర్ వెంకటరాజాగౌడ్ ను కాంగ్రెస్ పార్టీ నార్సింగి మండల బీసీ సెల్ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. సోమవారం రామయంపేటలో సీఐ వెంకటరాజాగౌడ్ ను కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్ కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.