*మంత్రి దామోదర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న రాజేశ్వర్ స్వామి*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ ఇంజనీర్ గా పని చేస్తున్న రాజేశ్వర్ స్వామి ఉత్తమ ఉద్యోగిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ స్వామి మాట్లాడుతూ.. తనపై మరింత పని భారం పెరిగిందని, సహాయ, సహకారాలు అందించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాఖ విద్యుత్ ఉద్యోగులు రాజేశ్వర్ స్వామికి అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now