గజ్వేల్, ఆగస్టు 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): మట్టి గణపతే శ్రేస్కారమని ప్రచారాన్ని నిర్వహించి భక్తులను చైతన్య పరుస్తూ పలు గ్రామాల్లో పర్యటించి మట్టి గణపతిని ప్రతిష్టించి పూజిస్తున్న కొందరిని ఎంపిక చేసి సత్కరిస్తున్నారు గజ్వేల్ లోని రామకోటి సంస్థ. అందులో భాగంగా ఆదివారం నాడు మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ భక్త బృందం వారు భారీ మట్టి గణపతిని ప్రతిష్టించిన సందర్బంగా శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు కమిటీ వారికి శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మట్టి గణపతిని ప్రతిష్టించి ఎందరికో ఆదర్శ ప్రాయంగా నిలిచారన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతిని వాడి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. పీఓపీ విగ్రహాల వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని తెలిపారు. భక్తులందరికి భద్రాచల తలంబ్రాలను అందజేశారు. మమ్మల్ని గుర్తించి ప్రోత్సాహించడం సంతోషంగా ఉందని రామకోటి రామరాజును చేబర్తి అంబేద్కర్ యూత్ గణేష్ బృందం వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ గణేష్ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.
చేబర్తి మట్టి గణపతి బృందానికి రామకోటి సంస్థ సన్మానం
Published On: August 31, 2025 6:05 pm