మెదక్/గజ్వేల్, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదని భక్తుల కోసం శ్రీరామకోటి భక్త సమాజాన్ని స్థాపించి గత 26 సంవత్సరాల నుండి ప్రతి వ్యక్తిచే రామకోటి వ్రాపిస్తూ ముక్తి మార్గాన్ని చూపిస్తున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు అనే రామభక్తుడు. వినాయక చవితి పండుగ శుభ సందర్బంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతులను తయారు చేసి భక్తులకు ఉచితంగా పంపిణి చేస్తున్నారు. గత 21సంవత్సరాల నుండి పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత అని ప్రచారాన్ని కరపత్రాల ద్వారా తెలియజేస్తూ రామకోటి రామరాజు మట్టి గణపతులను అందిస్తున్నారు. మొదటిగా 20 మట్టి గణపతులను పంపిణి చేశానని అంచలంచెలుగా మట్టి గణపతిని తీసుకపోయే భక్తులు పెరగడం వల్ల ప్రతి సంవత్సరం మట్టి గణపతుల పంపిణి సంఖ్య పెరిగిందని తెలిపారు. రామకోటి రామరాజు భార్య కూడా మట్టి గణపతుల తయారీలో నిమగ్నమయ్యారు. కుమారులు కూడా మట్టి గణపతులకు పంపిణిలో భాగస్వాములవుతున్నారు. రామకోటి రామరాజు భక్తి కుటుంబాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఈ సేవా అందరికీ సాధ్యం కాదని రామకోటి రామరాజుకె సాధ్యమైదన్నారు.
మట్టి గణపతులను సిద్ధం చేస్తున్న రామకోటి రామరాజు దంపతులు
Published On: August 25, 2025 5:04 pm