అంతకోటి పుణ్య ఫలాలను అందించేదే ఆషాడమాసం: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

మెదక్/గజ్వేల్, జూన్ 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం సంవత్సరంలో నాల్గవ మాసం. చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాడ, ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి ఆషాడం అని పేరు వచ్చిందని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆషాఢం అనంతకోటి పుణ్య ఫలితాలను అందించే మాసంగా పేరొందిందన్నారు. ఈ మాసం అమ్మ ఆరాధనకు శ్రేష్ఠమైనదన్నారు. గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయంలో గురువారం మొదటి బోనాల వేడుకలు ఆరంభమవుతాయని తెలిపారు. ఘటం ఎదుర్కోళ్లతో సంబరాలకు శ్రీకారం చుడతారన్నారు. తెలంగాణ ప్రాంతంలో బోనాల జాతరను ఘనంగా జరుపుతారని అన్నారు. దీనినే ‘బోనాల పండుగ’, ‘ఆషాఢ జాతర’గా పిలుస్తారని తెలిపారు. దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ అని, తొలి ఏకాదశి, చాతుర్మాసదీక్ష, గురుపూర్ణిమ, దక్షిణాన ప్రవేశం వంటి ఎన్నో విశేషాలకు నెలవు ఈ ఆషాఢమాసం అన్నారు. మనం కూడా ఆచారాలు పాటిద్దాం.. పూజాఫలం పొందుదాం.. అని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment