గజ్వేల్, ఆగస్టు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): వినాయక నవరాత్రోత్సాల్లో కళను ఉపయోగించి ఎన్నో విధాలుగా ఎన్నో రకాల చిత్రాను చిత్రించి భక్తిని చాటుకుంటున్నారు. అదే విధంగా శనివారం నాడు ఓ భక్తుడు కర్బుజా కాయ మీద అద్భుతంగా గణపతి చిత్రాన్ని అపురూపంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ప్రత్యేక పూజా నిర్వహించి తన అపారమైన భక్తిని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు, భక్తిరత్న, కళారత్న సేవారత్న, అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అనే భక్తుడు చాటుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని విజ్ఞాలు తొలగించే విగ్నేశ్వరుణ్ణి నవరాత్రులు పూజించి ముక్తిని పొందుతారన్నారు. నాలో ఉన్న ఆధ్యాత్మిక కళతో ఎన్నో రకాల భగవంతుని చిత్రాలు చిత్రించానన్నారు. భగవంతుణ్ణి స్మరించుకుంటూ కర్బుజా కాయ మీద గణపతిని చిత్రించానన్నారు. ప్రకృతిలో లభించే ప్రతి దాన్ని ఉపయోగించి వినాయకుణ్ణి తయారు చేసుకోవచ్చని నిరూపించారు రామకోటి రామరాజు అనే యువ భక్తుడు.
కర్బుజా కాయ మీద గణపతి చిత్రం వేసిన రామకోటి రామరాజు
Published On: August 30, 2025 6:16 pm