సిద్దిపేట/గజ్వేల్, సెప్టెంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): వినాయక నవరాత్రులలో భాగంగా బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు 1988 నాటి అరుదైన ఆనాటి చిన్న పది పైసలు 1000కి పైగా నానాలు ఉపయోగించి 6అడుగుల పొడువుతో అరుదైన అద్భుత గణపతి చిత్రాన్ని రూపొందించి భక్తిని చాటుకున్నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. భగవంతుడు నాకు కల్పించిన ఈ అద్భుత కళతో ఎన్నో రకాల భగవంతుని చిత్రాలు, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు గత 30 సంవత్సరాలనుండి చిత్రిస్తున్ననన్నాడు. తొలి పూజలందుకునే గణనాథుడు 9రోజుల పాటు భక్తులు గణపతి సేవలో తరిస్తారన్నారు. చిత్రాన్ని తిలకించి భక్తులు ఎప్పుడో చిన్నపుడు ఈ నానాలను చూశామని ఇప్పుడు ఈ రామకోటి రామరాజు చిత్రించిన గణపతి చిత్ర రూపంలో చూస్తున్నామని ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఒక నాణం దొరుకుడే కష్టం అంటే 1000 నానాలు సేకరించడం భగవంతుని రూపాలు వేయడం రామకోటి రామరాజు భక్తికి నిదర్శనం అని భక్తులు కొనియాడారు.
నానాలతో 6అడుగుల గణపతి రూపొందించిన రామకోటి రామరాజు
Published On: September 3, 2025 8:27 pm