ప్రజ్ఞాపూర్ విక్టరీ బాయ్స్ యూత్ ను సన్మానించిన రామకోటి రామరాజు

గజ్వేల్, సెప్టెంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): మట్టి గణపతులను ప్రతిష్టించిన వారిని ఎంపిక చేసి గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో సన్మానిస్తున్నారు. సోమవారం ప్రజ్ఞాపూర్ లోని రామాలయంలో విక్టరీ బాయ్స్ యూత్ ఏర్పాటు చేసిన భారీ మట్టి గణపతిని దర్శించి యూత్ సభ్యులను శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల నుండి 15 మంది యువకులు కలిసి భక్తి శ్రద్దలతో మట్టి గణపతిని పూజించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. నేటి యువత ఆధ్యాత్మికంగా ముందుండలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయర్ రాంఫణిధర్ శర్మతో పాటు విక్టరీ బాయ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment