ధైర్యంగా పోరాడి విజయం సాధించాలి..రమేష్ చైతన్య

ధైర్యంగా పోరాడి విజయం సాధించాలి..రమేష్ చైతన్య

IMG 20240927 WA0101

ప్రతి ఒక్కరూ జీవితంలో కష్టాలను , సవాళ్లను అధిగమించి ధైర్యంగా ముందుకు వెళ్లి విజేతలుగా నిలిచి నలుగురికి ఆదర్శంగా ఉండాలని ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైలర్ స్పీకర్ రమేష్ చైతన్య అన్నారు.మాచారెడ్డి జూనియర్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి జీవితంలో లక్ష్యాలు మరియు సవాళ్లు అనే అంశంపై ఆయన మాట్లాడారు సమస్యలనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయని కానీ అవి మనం ఎలా స్వీకరిస్తాం అనే దాని పైన మన విజయం ఆధారపడి ఉంటుందని అంతేగాని భయపడి ఆత్మహత్యలకు పాల్పడితే ఇటు కన్నవారికి అటు సమాజానికి తీరని నష్టం జరుగుతుందని సూచించారు. చిన్న చిన్న సమస్యలకే భయపడి యువతి యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా దురదృష్టకరం అని,ఈ ప్రపంచంలో సమస్యల తోనే ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగాయని, సమస్యలే కొత్త కొత్త ఆవిష్కరణలకు మూలమని అందుకే సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని సానుకూల దృక్పథంతో చూసి సరైన పరిష్కారాల దిశగా ఆలోచించినప్పుడే విజయం వరిస్తుందని ఆయన అన్నారు.రెండు చేతులు రెండు కాళ్లు లేకపోయినప్పటికీ నిక్ పూజిసిక్ ఎన్నో అవమానాలు కష్టాలను దాటుకొని ఇప్పుడు ప్రపంచంలో ఒక బెస్ట్ మోటివేషన్ స్పీకర్ గా ఉండడంతో పాటు, స్విమ్మింగ్, గోల్స్, బ్యాడ్మింటన్ లో కూడా ప్రావీణ్యం సంపాదించాడని ఉదాహరించారు.అలాగే చిన్నతనంలోనే పోలియో వచ్చి ఆరు సంవత్సరాల వరకు లేవ లేనటువంటి స్థితిలో ఉన్న నటువంటి విల్మా గ్లోడియం రూడాల్ఫ్ అనే మహిళ ప్రపంచంలోనే వేగవంతమైన పరుగుల రాణిగా ఒలంపిక్స్ లో నాలుగు బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు . కావున మన మనసును ఆ విధంగా సకారాత్మక దృష్టి వైపు మళ్ళించి మంచి అలవాట్లను, క్రమశిక్షణ కలవరించుకొని దేశంలో మంచి పౌరులుగా ఎదిగి సమాజంలో మంచి గుర్తింపు సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యకునుద్దీన్ అధ్యాపకులు తిరుపతి గౌడ్, నరసింహులు, రామకృష్ణ శ్రీనివాస్ సుదర్శన్ జయంత్ ప్రభాకర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now