సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈనెల 13న ఇంద్ర ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ అవార్డు అందుకోనున్నారు. వివిధ రంగాలలో అత్యుత్త ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి, వారు అందించే శ్రీదేవి సినీ అవార్డు ప్రధానోత్సవంను సంగాడి జిల్లా మునిపల్లి మండల్ కంకోల్ గ్రామానికి చెందిన తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ ఎంపిక అయ్యారు. ఈ నెల 13న హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో ఎలివేన్స్ కల్చర్ ఎలైట్ లో రమేష్ యాదవ్ అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు సామాజిక సేవలు చేశానను, తనను గుర్తించినందుకు ఇంద్ర ఆర్ట్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
*ఈనెల 13న ఇంద్ర ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డు అందుకోనున్న రమేష్ యాదవ్*
Published On: August 11, 2024 8:57 pm