రావూస్ కళాశాలకు జరిమానా..

రావూస్ కళాశాలకు జరిమానా. 

జింకా రెడ్డి శేఖర్ తీర్పు..

తీర్పు వెలువడిన వెంటనే విద్యార్థికి నష్ట పరిహారం అందజేసిన రావూస్ కళాశాలవిద్యార్థి వద్ద పూర్తి ఫీజు వసూలు చేసి అడ్మిషన్ ఇవ్వని రావూస్ కళాశాల యాజమాన్యంకు ఉమ్మడి నెల్లూరు వినియోగదారుల కోర్టు *న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్జరిమానా విధించారు.తరుపతి జిల్లా కురుగొండ గ్రామానికి చెందిన చెముడుగుంట సురేష్ అనే విద్యార్థి నెల్లూరు పట్టణంలోని రావూస్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ కోర్సులో చేరాలని నిర్ణయించుకున్నాడు. కళాశాల అడ్మిషన్ టీం విద్యార్థి తల్లిదండ్రుల వద్ద నుండి పూర్తి ఫీజు రూ. 48,300 వసూలు చేశారు. తరువాత విద్యార్థి సురేష్ ను కళాశాలలోకి అనుమతించడానికి కళాశాల యాజమాన్యం నిరాకరించారు. విద్యార్థి తల్లిదండ్రులు అతన్ని అనుమతించాలని బ్రతిమాలినా కళాశాల యాజమాన్యం వినలేదు. దీంతో కాలేజీ ఫీజు వాపసు చెల్లించాలని కోరినా యాజమాన్యం నిరాకరించడంతో భాదితులు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన రావూస్ కళాశాలకు సంబందించిన అడ్మిషన్ లిస్టును న్యాయమూర్తి ముందు ఉంచాలని ఆదేశించారు. అడ్మిషన్ లిస్టులో బాధితుడి పేరు లేకపోవడంతో అడ్మిషన్ ఇవ్వకుండా పూర్తి ఫీజు ఎందుకు వసూలు చేశారని యాజమాన్యంపై మండిపడ్డారు. వసూలు చేసిన ఫీజులో రూ.300 రిజిస్ట్రేషన్ మినహా మిగిలిన రూ.48,000లు 9 శాతం వడ్డీ తో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 5 వేలు భాదితుడి తండ్రికి చెల్లించాలని ఆదేశించారు. తీర్పు వెలువడిన వెంటనే బాధితుడికి తీర్పులో పేర్కొన్న డబ్బును కళాశాల యాజమాన్యం వారు చెల్లించారు. 

సంస్థకు రూ.1.33 లక్షలు జరిమానా*

జిల్లా న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ తీర్పు

తప్పుడు ప్రకటనలు, వాగ్దానాలతో విద్యార్థులను మోసం చేయడంపై మండిపాటు 

భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దంటూ హెచ్చరిక.

అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరించినందుకు గాను బైజూస్ సంస్థకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ రూ.1.33 లక్షలు జరిమానా విధించారు. తప్పుడు ప్రకటనలు, వాగ్దానాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దంటూ హెచ్చరించారు.నెల్లూరు పట్టణానికి చెందిన నిస్సి జమీ కిరణ్ అనే విద్యార్థిని గత ఏడాది ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించి.. బైజూస్ లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా నీట్ పరీక్షకు సన్నద్దమవ్వాలని నిర్ణయించుకుంది. కోర్సు మొదలైన వెంటనే మెటీరియల్, టాబ్లెట్‌ ను కూడా అందిస్తామని బైజూస్ ప్రతినిధులు వాగ్దానాలు చేశారు. తరగతులు సంతృప్తికరంగా లేకుంటే కోర్సు రద్దు చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ ఫీజు వాపసు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు 2023 జూన్ 11 న రూ.15 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఆన్లైన్ తరగతులు ప్రారంభమైన తర్వాత సరైన శిక్షణ లేకపోవడం, సంబంధిత మెటీరియల్, టాబ్లెట్‌ అందకపోవడంతో 2023 జూన్ 18న అడ్మిషన్ ఉప సంహరించుకున్నట్లు బైజూస్ సంస్థకు విద్యార్థిని తల్లిదండ్రులు తెలియజేశారు. దీంతో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.15 వేలు విద్యార్థి తల్లి ఖాతాలో జమచేస్తామని బైజూస్ సంస్థ ప్రతినిధి తెలియజేసి.. మోసం చేశారు. కాగా విద్యార్థిని తల్లి పవిత్ర ఖాతా నుండి ఆటోమాటిక్-డెబిట్ ద్వారా మిగిలిన కోర్సు రుసుము రూ.83,004 లు నెలవారీ ఇన్స్టాల్మెంట్స్ కింద బైజూస్ సంస్థ వసూలు చేసింది. అడ్మిషన్ ఉపసంహరించుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్, కోర్సు ఫీజు మొత్తం రూ.98,004లు బైజూస్ సంస్థ వసూలు చేసింది. దీంతో భాదితులు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ సాక్ష్యాలను పరిశీలించి తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.1.33 లక్షలు (ఫీజు కింద వసూలు చేసిన రూ.98,004లతో పాటు మానసిక ఆవేదనకు గాను రూ.30 వేలు, కోర్టు ఖర్చులకు గాను రూ.5 వేలు) తీర్పు వెలువరిని 45 రోజుల్లోగా చెల్లించాలని బైజూస్ సంస్థను ఆదేశించారు.

 

Join WhatsApp

Join Now