విద్యుత్ శాఖ కొత్త ఎస్ఈ బాధ్యతలు స్వీకరించిన రవీందర్
జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేత
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 26
బుధవారం: విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE)గా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ శాఖ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని రవీందర్ తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొత్త ఎస్ఈకి అభినందనలు తెలుపుతూ, జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.