ఉపగడ్డకు త్వరలోనే మరమ్మత్తులు
– చెరువు కట్టకు మట్టిని మోసిన కూలీల లెక్కలే ఈ ఉపగడ్డ
– ఆ తర్వాత పోచమ్మ దేవత వెలవడంతో ఆధ్యాత్మిక ప్రాంతంగా మారిన ఉపగడ్డ
జిల్లా అడిషనల్ కలెక్టర్ మూడు రోజుల క్రితం సందర్శించి ఉపగడ్డ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
ప్రశ్న ఆయుధం దోమకొండ, కామారెడ్డి
దోమకొండ గడికోట ముందున్న ఉపగడ్డను త్వరలోనే మరమ్మతులు చేయనున్నట్లు తెలిసింది. ఈ ఉపగడ్డపై గ్రామంలోని పెద్దమనుషుల నుండి భిన్నమైన కోణాల్లో పలు విషయాలు వ్యక్తమవుతున్నాయి. కుడి చెరువు తవ్వకాల సమయంలో కూలీల లెక్కలు ఇవ్వడానికి వారు తెచ్చిన తట్టలకొద్ది మట్టిని కుప్పగా పోయడంతో ఉపగడ్డగా మారిందని, తర్వాత అక్కడే పోచమ్మ దేవత వెలిసిందని, మొట్టమొదటి పోచమ్మ పూజలు ఉపగడ్డపైనే జరిగాయని పలువురు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత చెరువు ప్రక్కన ప్రస్తుతం ఉన్న గుడిలో పున ప్రతిష్టించడం జరిగిందని తెలిపారు. కొంతమంది గ్రామ పెద్దలు ఈ ఉపగడ్డను దేవి నిలయంగా భావించి దోమకొండ గ్రామం చల్లగా చూడాలని ప్రతి సంవత్సరంకు ఒకసారి పూజలు నిర్వహించే వారినీ ఇస్తుంది. అంతే కాకుండా బతుకమ్మ పండుగ సమయాల్లో మహిళలు బతుకమ్మలను చెట్టు ముందు ఉంచి బతుకమ్మ ఆటలు ఆడుతూ అమ్మ వారిని కొలిచేవారని ఇది ఆనవాయితుగా వస్తున్న ఆచారం అని తెలిపారు. ఈ ఉపగడ్డ సంరక్షణకు అన్ని వర్గాల ప్రజలు సుముఖంగా వున్నట్లు సమాచారం. ఈ ఉపగడ్డ రోజురోజుకు కొంచెం పోవడంతో దాని పరిరక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఉపగడ్డను అభివృద్ధి చేయాలని గ్రామపంచానుండి గడికోట నిర్వాహకులకు సైతం పత్రం అందినట్లు సమాచారం. గ్రామస్తుల అందరి సహకారంతోనే ఈ ఉపగడ్డను చారిత్రాత్మక గడ్డగా భావించి దాన్ని పరీక్షించాలని కోటనిర్వాకులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.