సంగారెడ్డి, ఆగస్టు 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి డీసీసీబీ బ్యాంకు మేనేజర్ ఎస్.వెంకటేష్ పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పోలీసు కృష్ణ ముఖ్య హాజరై పదవీ విరమణ పొందిన వెంకటేష్ దంపతులను శాలువా కప్పి, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్యాంకు మేనేజర్ గా వెంకటేశం ఉద్యోగులకు, కస్టమర్లకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పదవీ విరమణ పొందిన డీసీసీబీ మేనేజర్ వెంకటేష్‌కు సన్మానం
Published On: August 31, 2025 7:26 pm