జిల్లా వ్యాప్తంగా స్కూళ్లలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా స్కూళ్లలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులతో భద్రతా ప్రతిజ్ఞ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం జనవరి 01

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా 01-01-2026 నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు రహదారి నియమాలు పాటించాల్సిన అవసరం, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించాల్సిన ప్రాముఖ్యత, నాలుగు చక్రాల వాహనాలలో సీట్‌బెల్ట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. అదేవిధంగా రహదారిపై నడిచే సమయంలో జాగ్రత్తలు, ట్రాఫిక్ సంకేతాల అర్థం, వాహనాలను నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని విద్యార్థులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాలలో మోటార్ వాహన తనిఖీ అధికారులు, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. భవిష్యత్తులో రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించేలా విద్యార్థులు చైతన్యవంతులుగా మారాలని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment