సంగారెడ్డి, అక్టోబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రపంచ పోలియో దినం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉత్తమ సేవలందించిన వైద్య సిబ్బందికి రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మంజీరా అధ్యక్షుడు కిషన్ మాట్లాడుతూ.. రోగులకు ఉత్తమ సేవ అందించడం, వైద్యులు భగవంతునితో సమానమని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా చేస్తున్న సేవలను గురించి సమాజానికి ఎంతో ఉపయోగ పడుతుందని రోటరీ క్లబ్ కార్యదర్శి సిహెచ్ అంజయ్య తెలిపారు. విద్యా, వైద్యం ఉచితంగా ప్రభుత్వం అందించాలని ఏ దేశమైన విద్యా, వైద్యం ప్రజలకు బాగా అందజేస్తుందో ఆ దేశంలో ఉత్తమమైన పౌరులు, ఆరోగ్యవంతమైన ప్రజలు ఆ దేశానికి సేవ ఆందిస్తారని విశ్రాంత మండల విద్యాధికారి, అడ్వకేట్ డి.అంజయ్య తెలిపారు. ఉత్తమ సేవలందించిన వైద్య సిబ్బంది వెంకటలక్ష్మి, భాస్కరరావు, డాక్టర్ సుధారాణి, డాక్టర్ జెస్సికా, అరుణా జ్యోతి, సిహెచ్ విజయలక్ష్మిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు కిషన్, సిహెచ్ అంజయ్య, దినేష్, డి.అంజయ్య, కమలాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంగారెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి ఘన సన్మానం
Published On: October 24, 2025 10:04 pm