సిగాచి పరిశ్రమ ప్రమాద బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం: సీఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన విషాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఉదయం ప్రమాద స్థలాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో మరణించిన ప్రతి కార్మికుని కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా (పరిహారం) ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణమైన అంశాలు, బాధ్యులైన అధికారులు ఎవరైనా నిర్దిష్టమైతే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచారణ నివేదిక ఆధారంగా మరింత చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment