సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యార్థులు, యువత గంజాయికి, డ్రగ్స్ కు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సదాశివపేట పట్టణ ఇన్స్ పెక్టర్ మహేష్ గౌడ్ అన్నారు. శనివారం భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య ఆధ్వర్యంలో భవిత జూనియర్ కళాశాలలో గంజాయి డ్రగ్స్ నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుదాం.. అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇన్స్ పెక్టర్ మహేష్ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. అనేక మంది యువత కాలేజీ విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు ఆలవాటు పడి బానిసలుగా మారుతున్నారని అన్నారు. మంచి భవిష్యత్త ను కోల్పోతున్నారని, ఎవరు మత్తు పదార్థాలకు లోనూ కాకుడదని సూచించారు. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవోద్దని తెలిపారు. ఉన్నత చదువులకు దూరమవుతూ ఉద్యోగాలకు దూరమై కుటుంబాలకు భారమవుతున్నారని అన్నారు. జిల్లాలో కానీ సదాశివపేట పట్టణంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ కదలికలు కనిపించినా.. వెంటనే పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత, విద్యార్థులు భవిష్యత్తు పై దృష్టి సారించాలని తెలిపారు. ఉపాధి కోసం ప్రయత్నాలు చేయాలనన్నారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. డివైఎఫ్ఐ యువజన సంఘం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పట్టణాల్లో, గ్రామాల్లో యువత, విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలై ఆరోగ్యాలను పాడు చేసుకొట్టు తమ కుటుoబాలకు భారమవుతున్నారని తెలిపారు. చెడు వ్యసనాలు ఏళ్ల వేళల్లో దూరంగా ఉండాలన్నారు. విద్యార్థి దశ నుంచే యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలన్నారు. ఆరోగ్యంగా సంరక్షణ ప్రథమ కర్తవ్యం కావాలన్నారు. యువత మంచి ప్రయాణం ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్, యువత చేతుల్లో ఉందని అన్నారు. దేశం వివిధ రంగాల్లో రాణించాలంటే యువత మేధస్సు, నైపుణ్యం అవసరమని తెలిపారు. దేశ ప్రగతి ఔన్నత్యాన్ని నిలబెట్టగల శక్తి సామర్థ్యాలు యువతలో ఉండాలని అన్నారు. సమాజ హితం కొరే విధంగా యువత చర్యలు ఉండాలని పేర్కొన్నారు. యువత కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో మునిగి తేలుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. తమ విలువైన జ్ఞానాన్ని, విచక్షణను, శక్తిసామర్థ్యాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. గంజాయి,డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వినియోగం కూకటి వేళ్ళతో పెకిలిo చాలని పిలుపు నిచ్చారు. డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేయాలని యువతకు పిలుపునిచ్చారు. డ్రాగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అందరు కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు నిరోధించే విధంగా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా, డ్రగ్స్ వినియోగం తగ్గడం లేదన్నారు. మాదక ద్రవ్యాలు, అదేవిధంగా అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, యాజమాన్యాలు అందరూ కలిసి కట్టుగా పోరు సాగిస్తే మాదక ద్రవ్యాలు మహమ్మారిని తరిమివేయడం సాధ్యమని తెలిపారు. కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్యం మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలు కాకుండా మంచి ఉన్నతమైన చదువులు చదివి సమాజ అభివృద్ధికి పునాదులు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్, భవిత జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలరాజ్, డైరెక్టర్స్ మధుకర్ రెడ్డి, రాజు, రవి, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు సాయి, శివ, గోవర్ధన్, యూసుఫ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.