సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు నియోజకవర్గంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాలుగవ రోజు పలు వినాయక మండపాలను బీఆర్ఎస్ యువ నాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ సందర్శించారు. స్వామివారి పూజలో పాల్గొని, అర్చకుల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సాయిచరణ్ గౌడ్ మాట్లాడుతూ… వినాయక చవితి ఉత్సవాలు మన సంప్రదాయాలు, సంస్కృతి, సామాజిక ఐక్యతకు ప్రతీకలు. ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలనీ, వినాయకుని కృపతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఆనందం, సుఖశాంతులు కలగాలని ప్రార్థిస్తున్నానని ఆకాంక్షించారు.
వినాయక మండపాలను సందర్శించిన సాయిచరణ్ గౌడ్
Published On: August 31, 2025 9:54 pm