ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: సంగారెడ్డి గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజుగౌడ్

సంగారెడ్డి, ఆగస్టు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నిర్మించడానికి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సంగారెడ్డి గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజు గౌడ్ అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 10గంటలకు ట్యాంకు బండ్ పై బహుజన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇది మనందరి గౌడ్ అన్నల ఐక్యమత్య పోరాట ఫలితం అని, ప్రభుత్వము తరపున ట్యాంకుబండ్ పై పాపన్న విగ్రహాన్ని నిర్మించడాన్ని సంగారెడ్డి జిల్లా తెలంగాణ గౌడ సంఘం తరపున స్వాగతిస్తున్నామని అన్నారు. అలాగే ఈరోజు సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదురుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ జరుపుకుంటున్న సందర్భంగా మన గౌడ సోదరులందరు హాజరై విజయవంతం చేయాలని కోరారు. మన గౌడ కులస్తులందరూ ఐక్యమత్యంతో ఈ రోజు జరగబోయే బైక్, కార్ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని పాపన్న గౌడ్ చౌక్ వద్దకు చేరుకొని విగ్రహ ఆవిష్కరణ జరుపుకొని కలెక్టరేట్ లో అధికారికంగా నిర్వహించే సమావేశంలో పాల్గొని విగ్రహ కమిటీ ఏర్పాటు చేసిన భోజనాలను స్వీకరించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment