టీజీఎప్ సెట్ లో 13,833 ర్యాంక్ సాధించిన సంగారెడ్డి విద్యార్థిని

సంగారెడ్డి ప్రతినిధి, మే 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన టీజీఎప్ సెట్ లో సంగారెడ్డి పట్టణానికి చెందిన అరిగే కావేరి 13,833 ర్యాంక్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. తాను ఇంటర్ ఫలితాల్లో బైపీసీ లో 1000 మార్కులకు గాను 986 మార్కులతో స్టేట్ మొదటి ర్యాంక్, పదవ తరగతిలో 10/10 సాధించి సంగారెడ్డి పట్టణంలో ప్రభంజనం సృష్టించింది. సంగారెడ్డిలో చదివిన విద్యార్థిని చదువులో టాపర్ గా నిలవడంతో తోటి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అరిగే కావేరి తనకు చదువు చెప్పిన గురువులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ అరిగే సుధాకర్ కూతురు అరిగే కావేరి ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు పోలీస్ శాఖ వారు హర్షం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now