ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేయాలి: సంగారెడ్డి టీఎన్‌జీఓ సంయుక్త కార్యదర్శి ఉప్పరి సురేష్

సంగారెడ్డి, సెప్టెంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేయాలని, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ అగ్రికల్చర్ మినిస్ట్రీయల్ ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు, సంగారెడ్డి టీఎన్‌జీఓ సంయుక్త కార్యదర్శి ఉప్పరి సురేష్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లులు, జీపీఎఫ్ బిల్లులు వంటి అంశాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని సురేష్ డిమాండ్ చేశారు. బిల్లులు ఆలస్యమవ్వడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న సీపీఎస్ (కన్ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) విధానం అన్యాయమని, దీనిని రద్దు చేసి ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) విధానాన్ని అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఓపీఎస్ అమలులో ఉందని, తెలంగాణలో కూడా అదే విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment