గణేష్ గడ్డకు సర్పంచ్, వార్డు సభ్యుల పాదయాత్ర

సంగారెడ్డి/హత్నూర, డిసెంబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామ నూతనంగా ఎంపికైన సర్పంచ్ బేగరి శ్రీహరితో పాటు పాలక మండలి గణేష్ గడ్డ వరకు నిర్వహించే పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి బుధవారం ప్రారంభించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం గ్రామ దేవత అయిన భవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన సర్పంచ్ బేగరి శ్రీహరితో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాదయాత్రగా పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ శివారులోని గణేష్ మందిరం వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వడ్డించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కృష్ణతో పాటు పలు గ్రామాల నూతన సర్పంచులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment