సారు మాకు న్యాయం చేయండి 

సారు మాకు న్యాయం చేయండి 

  • జిన్నారం జంగంపేట రైతుల ఆవేదన. 
  • – తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన రైతులు, నాయకులు.
  • – 15 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతానని తహసిల్దార్ హామీ. 
  • – సంఘీభావం తెలిపిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పిటిసి కోలన్ బాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్

జిన్నారం మండలంలోని జిన్నారం,జంగంపేట గ్రామ రైతులు తమ భూములపై న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జిన్నారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జంగంపేట, జిన్నారం గ్రామాల్లోని అసైన్ భూములను జిహెచ్ఎంసి, టీజీఐఐసీకి అప్పగించిన తర్వాత, సంబంధిత అధికారులు రైతులకు కేవలం 600 గజాల సర్టిఫికెట్ ఇచ్చి బాధ్యత నుంచి తప్పించుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపకుండా, భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని వారు కోరారు.

ధర్నా సమయంలో రైతులు తమ సమస్యలను వివరంగా వివరించి వినతిపత్రాన్ని తహసిల్దార్‌కి అందజేశారు. దీనిపై తహసిల్దార్ జిహెచ్ఎంసికి సంబంధించిన భూమి సమస్యను 15 రోజుల లోపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కోలన్ బాల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్, రైతుల పక్షాన మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నరేందర్, కదీర్, కృష్ణ గౌడ్, రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, భ్రమేందర్ గౌడ్, రైతులు మల్లేష్, వెంకటేష్, విఠల్,యాదయ్య, నర్సిములు, శ్రీనివాస్, రాంచంధర్,దుర్గయ్య, మహేష్, వెంకట్ రెడ్డి, ఈశ్వరయ్య, పోచయ్య, శ్రీనివాస్, దుర్గయ్యా, రమేష్, కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment