గణనాథుని శోభాయాత్రకు సర్వం సిద్దం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): గణనాథుని శోభాయాత్రకు సర్వం సిద్దం చేశామని, పెద్ద శబ్దాలతో కూడిన డి.జె సౌండ్స్ వినియోగించరాదనీ, నిమర్జన సమయంలో సమయమనం పాటించాలని, శోభాయాత్ర, నిమర్జన సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సుమారు 800 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. బుధవారం ఎస్పీ మాట్లాడుతూ.. గురువారం, శనివారం జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వినాయకుల నిమర్జనాలు జరగనున్న నేపధ్యలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సుమారు 800 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గంలో కరెంట్ వైర్ లేకుండా సంభందిత శాఖలకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని అన్నారు. పలు ప్రధాన కూడళ్లలో, మజీద్లు, దర్గాలలు, చర్చీల పై రంగులు (గులాల్) పడకుండా ఎతైన బారికెట్స్ తో పాలితిన్ కవర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శోభా యాత్రను వీక్షించడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిమర్జనం జరిగే చెరువులు, కుంటల వద్ద నీళ్ళలోనికి దిగకుండా బారికెట్స్ ఏర్పాటు చేయించడం జరిగిందని, విగ్రహాలను నిమర్జనం చేయడానికి క్రేన్ లను అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రమాదవశాత్తు అనుకోని ప్రమాదం జరిగిన తక్షణం స్పందించడానికి గజ-ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. సబ్-డివిజన్ల వారీగా డీఎస్పీలచే బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుందని, అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు తక్షణం స్పందించి, గుంపును చెదరకొట్టడానికి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టిమ్స్ సిద్దంగా ఉంటాయన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ, మండప నిర్వాహకులు పోలీసు వారితో సహకరించాలని ఎస్పీ సూచించారు.

*గణనాథుని శోభాయాత్ర, నిమజ్జన సమయంలో పాటించవలసిన సూచనలు:*

1.ఊరేగింపులో డి.జె. లకు అనుమతిలేదు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి డి.జె.లు వినియోగిస్తే, అట్టి డి.జె. లను సీజ్ చేయడంతో పాటు, సంభందిత నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది.

2.వినాయక విగ్రహములను తీసుకొనివెళ్లే వాహనములలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, టపాకాయలు, మండే స్వభావం కలిగిన పదార్ధాలు అనగా పెట్రోలు, డీజిల్ మొదలగునవి ఉంచరాదు.

3.విగ్రహలను తీసుకొని వెళ్లే వాహనాల, డ్రైవర్ల యొక్క పూర్తి వివరాలు పోలీసు వారికి తెలియజేయాలి. వాహనం మంచి కండిషన్ లో ఉండే విధంగా చూసుకోవాలి. 

4.నిమజ్జనంలో పాల్గొనే వారు ఎలాంటి మత్తు పదార్థాలు సేవించకుండా నిర్వాహకులు జాగ్రత్తపడాలి.

5.ఎలాంటి వదంతులను నమ్మకూడదు, ఏదైనా సమాచారం తెలిసినా, అసత్య ప్రచారాలు చేసినా అలాంటి వ్యక్తుల వివరాలను డయల్ 100 ద్వారా లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలి.

6.ఊరేగింపులో కుంకుమ, గులార్ మొదలైన రంగులను దారిన పోయే వారిపై చల్లకూడదు.

Join WhatsApp

Join Now

Leave a Comment