*స్వాతంత్ర దినోత్సవ పతాకావిష్కరణ మరిచిన ఎస్ బీఐ బ్యాంక్ అధికారులు*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 9 గంటల వరకు నిర్వహించాల్సిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ (ఎస్ బీఐ) అధికారులు జాతీయ పతాక ఆవిష్కరణ గావించకపోవడం పట్ల ఖాతాదారులు, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పలువురు తెలిపారు. ఇదిలా ఉండగా జోగిపేటలోని ఎస్ బీఐ బ్యాంక్ అధికారులు 10గంటల వరకు పతాకావిష్కరణ చేయకపోవడం వల్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Join WhatsApp

Join Now