క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి తోడ్పడతాయి: స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ జిల్లా సెక్రటరీ అమూల్యమ్మ

క్రీడలు

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి తోడ్పడతాయి: స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ జిల్లా సెక్రటరీ అమూల్యమ్మ

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణ కేంద్రంలో డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ లో అండర్ 14, 17 బాల బాలికలకు స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీలను నిర్వహించారు. డీవైఎస్ ఓ ఖాసిమ్ బేగ్ పోటీలను ప్రారంభించారు. క్రీడల వలన విద్యార్థిని, విద్యార్థులకు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడుతుందని, విద్యార్ధులకు మానసిక ఓత్తిడిని అదిగమొంచడానికి క్రీడలు అత్యంత అవసరం అని స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ జిల్లా సెక్రెటరీ అమూల్యమ్మ అన్నారు. సంగారెడ్డి జిల్లా నుండి మొదటి స్థానంలో నిలిచిన మహమ్మద్ అబ్దుర్ రెహమాన్ సిద్ధిఖ్, అలియా ఫాతిమా, రితిక సాహితీ, అబ్దుల్ నజీర్, వివిధ విభాగాలలో రెండో స్థానంలో నిలిచిన నిషిత బాబ్జీ, మహమ్మద్ హుజేర్, వినీత్, విన్సెంట్ లు వచ్చేనెల 2వ తేదీన హైదరాబాదులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని పీడీ స్విమ్మింగ్ కోచ్ శేషు కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్, రమేష్, అభినవ్, చేవాన్ పవన్ కుమార్, కృష్ణతో పాటు సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now