సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతీయ వృద్ధుల దినోత్సవం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానిచంద్ర ఆదేశాల ప్రకారం గురువారం సంగారెడ్డిలోని ది గ్రేస్ వృద్ధాశ్రమంను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య మాట్లాడుతూ.. వృద్ధుల పట్ల చిన్న చూపు చూడకుండా వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటూ వారిని గౌరవంగా చూడాలని అన్నారు. అదేవిధంగా వారి బాగోగులను కూడా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, ఏదైనా న్యాయ సహాయం కోరితే సంగారెడ్డి న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంను సంప్రదించాలని తెలిపారు. వీరి వెంట ది గ్రేస్ వృద్ధాశ్రమం అధికారులు, వృద్దులు తదితరులు పాల్గొన్నారు.
వృద్ధాశ్రమంను తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
Published On: August 21, 2025 7:55 pm