సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. శనివారం నాడు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతిలోని తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు మాట్లాడుతూ.. బోధనలో ప్రతిరోజు ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో ఈ రోజు తెలిసిందని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి రోజు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. డీఈఓగా సంజయ్, ఎంఈఓగా ప్రేమ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలిగా నిహారిక, ఉపాధ్యాయులుగా మమత, శ్రీవిద్య సాత్విక, మనూష , ఘనసింధు, సిల్వన, ప్రణతి, సాయి సహస్ర వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, ఉపాధ్యాయులు నవనీత, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.