ఎస్ జి ఎఫ్ జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్

*ఎస్ జి ఎఫ్ జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్*

 

*ప్రారంభించిన ఎంపీడీవోలు ఎంఈఓ*

 

*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 27*

 

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని సిరిసేడు జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో 68వ జిల్లాస్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ టోర్నమెంట్ను ఎంపీడీవో పుల్లయ్య ఎంఈఓ రాములు కలిసి ప్రారంభించారు దీనికి ముందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీడీవో పుల్లయ్య ఎంఈఓ రాములు జడ్పీహెచ్ఎస్ సిరిసేడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్ జిల్లా ఎస్ జి ఎఫ్ కార్యదర్శి బి వేణు గోపాల్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కే రమ క్రీడా ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొని వారు మాట్లాడుతూ క్రీడల వలన మనోవికాసంతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుందని శరీర దారుగ్యత పెరుగుతుందని ప్రతి క్రీడాకారుడు గెలుపు ఓటములను లెక్కచేయకుండా అవరోధాలను ఎదుర్కొన్న ముందుకు వెళ్లే విధంగా చూసుకోవాలని తెలిపారు 16 మండలాల క్రీడాకారులకు నూతన ఉత్తేజాన్ని కలిగించారు 17 సంవత్సరాల లోపు గల 32 జట్లు బాల బాలికలకు వేరువేరుగా వాలీబాల్ పోటీలను నిర్వహించారు ఈ వాలీబాల్ పోటీలో బాలుర విభాగంలో చొప్పదండి జట్టు ప్రథమ బహుమతి పొందగా కరీంనగర్ అర్బన్ ద్వితీయ బహుమతి బాలికల విభాగంలో కొత్తపెళ్లి జట్టు ప్రథమ బహుమతి చొప్పదండి జట్టు ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ఎస్ జి ఎఫ్ కార్యదర్శులు వ్యాయామ విద్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు క్రీడా పోషకులు క్రీడాభిమానులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు సుమారు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now