*బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు..*
*ప్రశ్న ఆయుధం,జులై 20 శేరిలింగంపల్లి,ప్రతినిధి*
అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు చందానగర్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ అమ్మ వారి ఆలయంలో శేరిలింగంపల్లి నియోజక వర్గ తెలుగు దేశం పార్టీ ఇంచార్జీ కట్టా వెంకటేష్ గౌడ్ ఆహ్వానం మేరకు అమ్మ వారిని దర్శించిన తెలుగు దేశం పార్టీ నాయకులకు ఆలయ అర్చక బృందం అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాలతో సత్కరించి ఆశీస్సులను అందజేశారు. అనంతరం మియాపూర్ బస్ బాడీ వద్ద గల శ్రీ కనకదుర్గా కాళీమాతా ఆలయంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గుండె దయానంద్ ముదిరాజ్ కమిటీ తరపున శాలువలతో సత్కరించి ఆలయ ప్రధాన అర్చకులు మాన్య సందీప్ మహరాజ్ చే ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి సన్నిధి లో శాలువాలతో సత్కరించి అమ్మ వారి ఆశీర్వచనాలు అర్చక బృందం చే అందించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు ఎం.ఆర్.కే చౌదరీ మాట్లాడుతూ శాంతి నగర్ అమ్మవారి ఆలయ కమిటీ నిర్వాహకులకు,మియాపూర్ శ్రీ కనకదుర్గా కాళీమాతా ఆలయం నిర్వహణ కమిటీ సభ్యులకు తెలుగు దేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజక వర్గ ప్రజల కు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతీ ఒక్కరికీ అమ్మవారి కృపా కటాక్షములు ఉండి వారి వారి రంగాలలో అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు ఎం ఆర్ కే చౌదరీ తో పాటు మియాపూర్ డివిజన్ తెలుగుదేశం పార్టీ కి చెందిన నాయకులు తులసీ చౌదరి, అభిజిత్, రాజేష్, చేబ్రోలు నరేశ్, చిన్నా, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు
by Madda Anil
Published On: July 20, 2025 8:55 pm