హైదరాబాద్, జూలై 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ లోని ఇతిహాస హోటల్ లో లఘు ఉద్యోగ భారతి వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గత రెండు సంవత్సరాల సంస్థ ప్రగతి నివేదికను ఆర్ధిక నివేదికను సమర్పించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన లఘు ఉద్యోగ భారతి అఖిల భారత సంఘటన కార్యదర్శి ప్రకాష్ చంద్ర తెలంగాణ ప్రాంత లఘు ఉద్యోగ భారతి నూతన కమిటీని ప్రకటించారు. సంస్థకు మార్గదర్శనం చేశారు. ప్రత్యేక అతిధిగా తమిళనాడు నుండి వచ్చిన లఘు ఉద్యోగ భారతి అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఎంఎస్ఎంఈ బోర్డు మేంబర్ మొహం సుందరం సంస్థను ఎలా విస్తరించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత లఘ ఉద్యోగభారతి ఈ సీ మెంబెర్ అనిల్, అనంత్ నూతన అధ్యక్ష కార్యదర్సులు వసంతమ్ వెంకటేశ్వర్లు, కందుల నరేంద్ర నాథ్ దత్, ట్రేజరర్ అనూజ్ ఖండేల్వాల్, సంయుక్త కార్యదర్శి సంతోష్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ సుధాకర్ శర్మ, కుసుమ వెంకటేశ్వర్లు, ఆర్ ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు, లఘు ఉద్యోగ భారతి తెలంగాణ ప్రభారీ శ్రీధర్ రెడ్డి, తెలంగాణ సంఘటన కార్యదర్శి శివరాం, స్వవలంబి భారత్ అభియాన్ తెలంగాణ కో కన్వీనర్ బొల్లంపల్లి ఇంద్రసేన రెడ్డి, ప్రత్యేక ఆకర్షణగా లఘు ఉద్యోగ భారతి సభ్యురాలు పారిశ్రామిక వేత్త మాధవిలతతో పాటు పలువురు పాల్గొన్నారు.
లఘు ఉద్యోగ భారతి వార్షిక సర్వ సభ్య సమావేశం
Published On: July 10, 2025 8:59 pm