సంగారెడ్డి/పటాన్ చెరు, ఏప్రిల్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): విజయవాడ ప్రాంతానికి చెందిన రెండు సంవత్సరాల చిన్నారి క్యాన్సర్‌తో బాధ పడుతోంది. ప్రస్తుతం ఆమె విజయవాడలోని హెచ్ సీజీ క్యాన్సర్ సెంటర్‌లో చికిత్స పొందుతోంది. ఆర్థికంగా వెనుకబడిన ఈ చిన్నారి కుటుంబం పటాన్ చెరుకు చెందిన “సింహ వాహిని ఫౌండేషన్”ను సంప్రదించగా.. ఈ నేపథ్యంలో ఫౌండేషన్ రూ. 37,050 నిధులను సేకరించి, ఫౌండేషన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి, సభ్యులు స్వయంగా విజయవాడకు వెళ్లి చిన్నారి కుటుంబాన్ని కలుసుకొని చిన్నారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని తమవంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కుటుంబానికి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలంటూ ఫౌండేషన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
చిన్నారి చికిత్సకు ఆర్థిక సహాయం అందజేసిన “సింహ వాహిని ఫౌండేషన్”
Published On: April 5, 2025 10:39 am
