పత్తి అమ్మకానికి స్లాట్ బుకింగ్ తప్పనిసరి
కాపాస్ కిసాన్ యాప్ ద్వారా ముందస్తు నమోదు చేయాలని కలెక్టర్ సూచన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు పత్తి రైతులు CCI కేంద్రాల్లో పత్తి అమ్ముకునేందుకు తప్పనిసరిగా స్లాట్ బుకింగ్ చేయాలన్నారు. రైతులు తమ స్మార్ట్ఫోన్లో కాపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసి ముందుగా నమోదు చేసుకొని, తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా మద్నూర్లోని కృష్ణా నాచురల్ ఫైబర్ జిన్నింగ్ మిల్లు CCI ద్వారా ఎంపికైందని తెలిపారు. స్మార్ట్ఫోన్ లేని రైతులు సంబంధిత అధికారుల ద్వారా స్లాట్ బుకింగ్ చేయవచ్చన్నారు. తేమ 8% లోపే ఉండేలా పత్తిని ఆరబెట్టి రూ.8110 ఎంఎస్పీ ధర పొందవచ్చని చెప్పారు.